Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మలిదశ దండోరా ఉద్యమ రథసారథి దండోర దళపతి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ జన్మదిన వేడుకలు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ధర్మారపు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని తారా స్థాయికి చేర్చిన వ్యక్తులలో అగ్రగణ్యుడు విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థుల సమస్యలపైన మాదిగ జాతి సమస్యలపైన అనేకమైన పోరాటాలు చేసినా ఆశాజ్యోతి వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. నాయకులు వరిగడ్డి చందు, శాగంటి రాజేష్ మాట్లాడుతూ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ జాతి అభివద్ధి కోసం విద్య ఆయుధంగా ముందుకు పోవాలని ఇక ఫూలే, అంబేద్కర్, కాన్షీరావ్ల ఆలోచన విధానంలో ముందుకుపోవాలని విద్య ఆయుధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ఎదుట పూల మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఓయూ అధికార ప్రతినిధి నాగరాజు, కార్యదర్శి మోగిలిపక కిరణ్, నరేష్, శ్రావణ్, రవితేజ, అనిల్, శ్రీకాంత్, అరవింద్ పాల్గొన్నారు.