Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిరజ్ తెలిపిన వివరాల ప్రకారం షేక్‌పేట గాంధీనగర్‌లో నివసిస్తున్న పల్లపు శ్రీనివాస్ అలియాస్ శ్రీను(41) దినసరి కూలీ. ఇంట్లో ఉంటూ అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి రెండు రకాల బ్రాండ్లు, మొత్తం 60 బాటిళ్లు స్వాధీనపర్చుకున్నారు. సెక్షన్ 34 (ఎ) ఆబ్కారి శాఖ యాక్ట్ 1897 ప్రకారం51(బి) క్రింద కేసులు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.