Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆశా వర్కర్లు తో కలిసి క్షీరాభిషకం చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వారికి 30శాతం జీతం పెంచిన సందర్భంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్‌గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నెరవేర్చుతారని తెలిపారు. ఈ కార్య క్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, యువ నాయకులు ముఠా జై సింహ, ముఠా నరేష్, కార్యదర్శి పోతుల శ్రీకాంత్, లక్ష్మి గణపతి దేవస్థానం చైర్మెన్ ముచ్చకూర్థి ప్రభాకర్, వార్డు సభ్యులు రాకేష్ కుమార్, ఆకుల శ్రీనివాస్, పరశురామ్, మరిసెట్టి నరసింగరావు, పున్న సత్య నారాయణ, హెచ్.హనుమంతు, శివ సింహ, ఆశావర్కర్లు స్వప్న, దుర్గ, యాదమ్మ, మల్లీశ్వరి, జగశ్వరి తదితరులు పాల్గొన్నారు.