Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనలో వామపక్ష నేతలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించే వరకు పోరాడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బలమల్లేశ్, సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి పి.సత్యం, సీపీఐ జిల్లాకార్యదర్శి సాయిలుగౌడ్లు అన్నారు. వామపక్షాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ మేడ్చల్ జిల్లా కమిటీల అధ్వర్యంలో కలక్టరేట్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ధరల పెంపుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఓ వైపు ప్రజలు కరోనా ప్రభావంతో కష్టాల్లో ఉంటే ఆదుకునే చర్యలు చేపట్టకుండా 46 రోజుల్లో 26 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్య అని విమర్శించారు. కరోనా తీవ్రతను అరికట్టడంలోనూ మోడీ సర్కారు విఫల మైందన్నారు. ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాలను కల్పించలేదని గుర్తు చేశారు. కరోనా మొదటి దశలో 14 కోట్ల మంది, రెండో దశలో 2 కోట్లమంది ఉపాధి కోల్పోయారని అన్నారు. ఆర్థికంగా చితికిపోయిన, ఆదాయపు పన్ను పరిమితికి లోబడిన ప్రతి కుటుంబానికి ప్రతీ నెల రూ. 7, 500/- అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ఎం.ఎల్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్,
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి, రొయ్యల కష్ణమూర్తి, జే.లక్ష్మీ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ రావు, తోటపల్లి శంకర్, సిపిఎం జిల్లా నాయకులు సి.ఎచ్. యాదయ్య, ఏ.అశోక్, శ్రీనివాస్, వెంకట్, ఉన్ని కష్ణన్, సబిత, కపాసాగర్, గణేష్, సీపీఐ (ఎం.ఎల్)న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ప్రవీణ్, ఎం.డి. అబ్దుల్, సీపీఐ నాయకులు డి.జంగయ్య, టీ.యాదయ్య, కే. జయచంద్ర, రొయ్యల గిరిజ, ముడి మార్టిన్, ఎల్.ఈశ్వర్, ధర్మేంద్ర, డి.యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి వినతి పత్రం అందజేశారు.