Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 మందికి పౌష్టికాహారం అందజేసినం : డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి మహేందర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీ ఆస్పత్రిలోని కరోనా బాధితులకు, చిరుద్యోగులకు డీవైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమారు 200 మందికి నాన్వేజ్తో కూడిన పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నగర కమిటీ కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ కరోనా చిక్సిత కోసం గాంధీ ఆస్పత్రికి వేలాది మంది నగరం నలువైపులా నుంచే కాకుండా తెలంగాణలోని పల్లెల నుంచి వస్తుంటారని, కరోనా రోగులతో పాటు వారి అటెండర్స్ లాక్డౌన్ కారణంగా ఆకలికి అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి దగ్గర హౌటల్స్ లేకపోవడం.. ఉన్నా వారి దగ్గర రాకపోవడంతో తిండికి తిప్పలు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటి పేదల ఆకలి తీర్చేందుకుగాను మహేష్ యాదవ్, రషీద్‌ల సహకారంతో ప్రాణాలను లెక్కచేయకుండా గాంధీ ఆస్పత్రిలో ఆహార పంపిణీ చేపట్టామని వివరించారు. కరోనా బాధితుల అటెండర్స్‌కు భోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్.మహేష్ యాదవ్, హఫీజ్, యాదుల్లా, అబ్దుల్ అలీం, సాగర్ పాల్గొన్నారు.