Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- పలు అభవృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-హస్తినాపురం
నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్లో నెలకొన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరించి ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శనివారం హస్తి నాపురం డివిజన్ పరిధిలో దాదాపు రూ.24 కోట్లా 80 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మశ్రీను నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. సాగర్ ఎంక్లేవ్, టీకేఆర్ ఆర్చి, శివసాయి కాలనీ, శ్రీనగర్ కాలనీ, శ్రీ గాయత్రి నగర్‌కాలనీ, భీమ నగర్ కాలనీల్లో నూతన బాక్స్ డ్రైన్స్ పనులకు, భుపేష్ గుప్త నగర్ స్మశానవాటికలో బర్నింగ్ యంత్రాలు, నూతన నిర్మాణం, పార్క్ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే వర్షంకాలం దృష్ట్యా ఓపెన్ నాళాల మీద స్లాబ్స్ వేశామన్నారు. ఓపెన్ డ్రైన్స్ పెద్దగా చేస్తామని తెలి పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ బాక్స్ డ్రైన్స్ నిర్మాణ పనులు పూర్తయితే చుట్టుపక్కల కాలనీ వాసులకు ఎలా ంటి వరదనీటి సమస్యలు ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేరెడ్డి ఉదరు కుమార్‌రెడ్డి, నారగోని, శ్రీనివాస్ యాదవ్, అం దోజు సత్యనారాయణచారి, రెడ్డి మాలకృష్ణ డేరంగుల కృష్ణ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పి.నరేష్‌యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, ఎరుకల మల్లేష్‌గౌడ్, అనిత, ఆదిలక్ష్మీ, అరుణ్ వివిధ కాలనీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.