Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్ పుణ్య మేననీ, పార్టీ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు మరవద్దని మల్కాజ్గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అడ్వ కేట్ బండి శ్యామ్గౌడ్ అన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో గల నిర్మాణ్ వికలాంగుల ఆశ్రమంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులతోపాటు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్కు పూర్వవైభవం రానుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో బీజేపీి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభు త్వాలు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి ఒక్కరూ మాన వతా దృక్పదంతో వికలాంగులకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సువ్వారి శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్, తదితరులు పాల్గొన్నారు.