Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
కార్యకర్తలకు ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. శనివారం పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని రావి నారాయణ రెడ్డి కాలనీలో ఇటీవల కరోనాతో మరణించిన కళాకారుడు మారేడు చిన్న సంతాప సభను ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాలచారి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ముత్యాల యాదిరెడ్డి హాజరై చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా నా ట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ నేతృ త్వంలో జమ చేసిన పది వేల రూపాయలను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి చేతుల మీదుగా మారేడు చిన్న కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు అమనగంటి వెంకన్న, కాల నీ కార్యదర్శి ఫుల్లయ్య, సహాయ కార్యదర్శి నిరంజన్, కార్య వర్గ సభ్యులు నారాయణ, రమేష్, పగుడాల మహేందర్, పరుష రాం, భాస్కర్ రాం, నరసింహ పాల్గొన్నారు.