Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అలీకేఫ్ చౌరస్తా నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే బీటీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం ఈ బీటీ రోడ్డును రూ.49 లక్షల వ్యయంతో, న్యూ ప్రేమ్‌నగర్ రోడ్డుకు రూ. 16 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం న్యూప్రేమ్‌నగర్ బస్తీలో పాదయాత్ర చేపట్టి డ్రైనేజీ, కలుషిత నీటి సమస్యపై స్ధానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రయినేజీ వ్యవస్థ, రోడ్ల ఆధునీ కరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కలుషి త నీటి నివారణకు కొత్త పైప్‌లైన్ నిర్మాణం చేపడతా మన్నారు. ఈ కార్యక్రమంలో లవంగు ఆంజనేయులు, ఆమ నూరి సతీష్, లింగారావు, ఎర్రబొలు నరసింహారెడ్డి, మల్లేష్ యాదవ్, సిద్ధార్థ ముదిరాజ్, దయాకర్ యాదవ్, సలీం, రంగు సతీష్‌గౌడ్, రాగుల ప్రవీణ్, జాకీబాబు, మహేష్ ముదిరాజ్, మల్లికార్జున యాదవ్, సింగజోగి శ్రీనివాస్, అజ రు ముదిరాజ్, వంజరి ప్రకాష్, మహేష్ గంగపుత్ర, ధరమ్, విష్ణు, మోసిన్, మహమ్మద్‌గౌస్, సూరి, ఆదిల్, హైమద్, రఫిక్, యూసుఫ్‌బాబా, రంగు ఉదరుగౌడ్, నాగరాజు, సం తోష్చారి, వెంకట్‌గౌడ్, నర్సింహులు, పేంటం యాదగిరి, చందర్, సత్యనారాయణ, వాసుదేవచారి పాల్గొన్నారు.