Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- 'గాందీ'కి మృతదేహం తరలింపు
నవతెలంగాణ-ఘట్కేసర్
అనుమానాస్పద స్థితిలో, కాలిన గా యాలతో ఓ యువతి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మహ బూబ్‌నగర్ జిల్లా ఉంద్యాల గ్రామానికి చెందిన దంపతులు కొన్నేండ్ల కిందట పోచా రం మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప ప్రాంతానికి వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నా రు. మృతురాలి తండ్రి పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం, మృతురాలు స్రవంతి (19) తరచూ ఫోన్లో మాట్లాడుతు ండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన యువతి అర్ధరాత్రి తల్లి తండ్రులు పడుకున్న సమయంలో కిరోసిన్ డబ్బాతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం ఘట్కేసర్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో కాలిన గాయా లతో యువతి మృతదేహం ఉన్నట్లు పోలీ సులు కనుగొన్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసు కొని దర్యప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా ఇది హత్యా, ఆత్మ హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. పోస్టుమార్టం రిపోర్టువస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.