Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెట్రోల్, డిజిల్, గ్యాస్, నిత్యా వసర సరుకుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డీ విరుస్తుందని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా నాయకులు బి.ఎన్.సుదర్శన్, ఆలీండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫె˜డరేషన్ సీఐటీియూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శంకర్లు అన్నారు. పెంచిన పెట్రోల్, డీిజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం జెఎన్టియు ప్రగతినగర్ ఆటో స్టాండ్ వద్ద ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అవుతున్నా పేద ప్రజల బతుకులు మారకపోగా పెట్రోల్, డీిజిల్, గ్యాస్ ధరలను పెంచి మరింత భారం వేసిందన్నారు. కరోనాతో ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్ల్లీ, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలలో పేద ప్రజలకు, ఆటో కార్మికులకు నెలకు రూ.10 వేలు ఇచ్చి రేషన్ బియ్యం అందించి అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించి తమ ఖజానాను నింపుకోవాలని చూస్తుందన్నారు. పెంచిన పేట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రభుత్వ భూముల అమ్మకాలను అపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహ, సుధాకర్, ఆటో స్టాండ్ అధ్యక్షులు మహేష్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వరరావు, సింగ్, శివ, జ్యోతి, గౌస్, పుల్లారెడ్డి, మహమ్మద్, జ్ఞానేశ్వర్, వీరప్ప, శ్యామ్, సంజీవ, పర్వేజ్, జ్యోతి, రాజు, అశోక్, నారాయణ, ప్రకాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.