Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొ రేషన్‌లోని సమస్యలను త్వరి తగతిన పరిష్కరించి ప్రగతి పథంలో ముందుకు నడిపి నగరంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లా పూర్ నియోజకవర్గం ఎమ్మె ల్యే కేపీ వివేకానంద తెలి పారు. శనివారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యంలో 33 వార్డులలో నెలకొన్న సమస్యలను, చేపట్టబోయే అభివద్ధి పనులు, ప్రజా సమస్యలపై వివిధ శాఖల ఉన్నతా ధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్, స్థానిక మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, కమిషనర్ గోపీ, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్‌తో పాటు కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్, ఆర్అండ్బి, ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయా కార్పొరేటర్లు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్రగతినగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్లు డివిజన్లలో అభివద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, వేగవంతం చేయాలని , పారిశుధ్యం రోజువారీగా తీసుకెళ్ళుతూ మెరుగుపరచాలని, ఇకమీదట వర్షాకాలం దష్ట్యా అంబిర్ చెరువు పైపులైన్లు ఏర్పాటు వేగవంతం చేయాలని, అలాగే ప్రభుత్వం ప్రతి ఇంటికి 20000 లీటర్ల ఉచిత నీటి పంపిణి నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలో నడుస్తుండగా అట్టి ఉచిత నీరు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం ప్రజలకు తీసుకువచ్చి మెరుగు పరచాలని ప్రగతి నగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్లు శ్రీరాములు నేతత్వంలో ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచి నీటి పైపు లైన్లు, వీధి ద్వీపాలు, పార్కుల అభివద్ధి వంటి వాటికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు తన దష్టికి తీసుకువచ్చిన అభివద్ధి పనులు, సమస్యల శాశ్వత పరిష్కారానికి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధిóకారులు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.