Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి కేటాయించడం లాభదాయకం
- డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య
నవతెలంగాణ-తుర్కయాంజల్
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. తుర్క యంజాల్ రైతు సేవా సహకార సంఘానికి కోహెడలోని సర్వే నెంబర్ 507లో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందనీ, కలెక్టర్ అమోరుకుమార్ భూమి ప్రొసిడింగ్స్ అందజేసినట్టు తెలిపారు. తుర్కయాంజల్ సహకార బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాy ేశంలో సత్తయ్య మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది కోహెడలో నెలకొల్పిన ఫ్రూట్ మార్కెట్‌కు ఆనుకుని ఈ భూమి కేటాయించడం రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ఎఫ్ఏసీఎస్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆదివారం ల్యాండ్‌ను సందర్శిస్తామన్నారు. నాబార్డు ఇచ్చిన లోన్, తుర్క యంజాల్ ఎఫ్ఏసీఎస్ బ్యాంకు లాభాలు కలిపి తమ దగ్గర రూ.4.30 కోట్ల నిధి ఉందనీ. ఈ డబ్బులతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ, గోడౌన్లు, కాంటా, రైతులు సేద తీరేందుకు విశాలమైన గదులు నిర్మించనున్నట్టు తెలిపారు. ఏడాది లోపు ఈ నిర్మాణాలన్నీ పూర్తిచేసి రైతులకు అందుబాటు లోకి తెస్తామన్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.25కోట్లకు పైనే ఉంటుందనీ, ఈ భూమి తుర్కయంజాల్ ఎఫ్ఏసీఎస్కు కేటాయించడానికి సహ కరించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబిత, డీసీ సీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ నర్సింహ, రైతు సమన్వయసమితి అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, ఎఫ్ఏసీఎస్ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు శీలం లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, సామ సత్యనారాయణరెడ్డి, నాయకులు కొండ్రు శ్రీని వాస్, చెక్క సుధాకర్, మేతరి శంకర్ పాల్గొన్నారు.