Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ
- రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆలయాలు మానసిక ప్రశాంతతకు దోహదపడు తాయని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయ కులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శనివారం గాజులరా మారం డివిజన్ రాంకీ వన్ గ్రేటర్ కమ్యూనిటీ అపార్టు మెంట్లో నిర్వహించిన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవానికి ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు నందనం దివాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్నేత, మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డినగర్ డివిజన్ అధ్యక్షులు పరిష వేణు, గాజులరామారం డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌వర్మ, రాంకీ వన్ అపార్టుమెంట్ అధ్యక్షులు శివరామరెడ్డి, విజయకృష్ణ, నాయకులు భానుచందర్, సునీల్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.