Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల ఐక్య వేదిక నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శనివారం ఎమ్మె ల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులు ఐకమ త్యంతో సమస్యలను తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరిస్తా నన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షే మ పథకాలు అర్హూలకు అందే విధంగా సభ్యులు కృషి చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బేకు ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి హనంకొండ ప్రేమ్‌కుమార్, కోశాధి కారి మట్ట నర్సింహులు, సలహాదారులు ఆర్.సిద్దయ్య, బి.అమర్‌బాబు, ఎ.జేమ్స్, బి.విజరుభాస్కర్, జిజే.రత్నం, డేవిడ్, యాదయ్య, నాగరాజు, జానయ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.