Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జవహర్‌నగర్
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌కు చెందిన గబ్బిలాలపేట ప్రాంతంలో విద్యుత్ స్తంభా లు, విద్యుత్ దీపాలు, రోడ్ల సమస్యలతో సతమత మవుతున్న విషయాలను ఎన్నిసార్లు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన దాఖలాల్లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యుత్ స్తంభంపై రెండు గల్లీల ఇండ్లకు చెందిన సర్వీస్ వైర్లు ఒకే స్తంభంపై ఉండడం వలన విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగి ప్రమాద సంకటంగా మారిన దృశ్యాన్ని కన్నులకు కట్టినట్టుగా కార్పొరేటర్‌కు చూపించిన్నప్పటికీ శ్రద్ధ్ద చూపడం లేదన్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ఆ స్తంభం ఎక్కడ ఇండ్లపైన పడుతుందో అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం బోరుబావి మోటర్ కాలిపోవడంతో ఈ లాక్డౌన్ సమయంలో తీవ్ర నీటిని ఎద్దడిని ఎదుర్కొంటున్నామని అడపదడప ఒకటో రెండో నీటి ట్యాంకర్లు వస్తే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న వారికి సరిపోకపోవడం వలన కాలనీ లోపల ఉన్న వారం 500 లీటర్ల వాటర్ ట్యాంకర్‌కు 200 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విన్నవించారు. ఈ కరోనా వైరస్ ఉధృత సమయంలో తిండి కోసమే తిప్పలు పడుతుంటే నీళ్లను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడం కార్పొరేటర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా అని బాధను వెల్లిబుచ్చారు. ఇప్పటికైనా కార్పొరేటర్ ప్రతి గల్లీలో విద్యుత్ స్తంభాలు భూగర్భ డ్రైయినేజీలు, రోడ్లు మరమ్మత్తుల కార్యక్రమాలు బోరుబావుల మోటర్లు బాగుచేయించి నీటి ఎద్దడిని తీర్చే కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.