Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-చాంద్రాయణగుట్ట
పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల పండుగ ఆదివారం నుండి ప్రారంభమైంది. లాభం లాక్డౌన్ తొలగించడంతో బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ బల్వంత్ యాదవ్ గత ఆదివారం కమిటీ సభ్యులతో అన్నారు. ఆదివారం ఉప్పుగూడలోని మహంకాళి మాత ఈశ్వరి అమ్మవారి ఆశాఢమాసం బోనాల పండగ ప్రారంభమైంది. ఉదయం 5గంటలకు గణపతి పూజతో ప్రారంభమై. అమ్మవారికి అభిషేకం 9 గంటలకు అమ్మవారి అలంకరణ దివ్యదర్శనం కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో దేవాల యానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కరోనా నియంత్రణలను పాటించాలి. భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ తప్పనిసరి అని ఉప్పుగూడ మహంకాళి దేవాలయం చైర్మన్ జనగామ మధు సూదన్గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ కమిటీ చైర్మన్ బల్వంత్ యాదవ్ బంగారు మైసమ్మ మాజీ చైర్మన్ హంసరాజ్ మధు కార్యదర్శి .ప్రధాన కార్యదర్శి కీర్తి సురేష్ ముదిరాజ్ ఆకుల వినోద్ రాజ్గౌడ్, చింతల బాబురావు, ప్రదీప్గౌడ్, రుద్రారం శ్రీనివాస్ ముదిరాజ్ బత్తుల సుభాష్, ఆనంద సాయి తదితరులు పాల్గొన్నా