Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భారత సుప్రీంకోర్టు 48వ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణకు ఆదివారం ఓయూ బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో న్యాయమూర్తుల నియామకాలలో సామాజిక న్యాయాన్ని పాటించేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లా అకాడమీని ఏర్పాటు చేయాలని, స్టేట్స్ యూనివర్సిటీ లా గ్రాడ్యుయేట్స్‌కి జడ్జిలు ఇంటెన్షిప్ ఇవ్వాలని మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ప్రజలకు న్యాయ సేవలను పటిష్టంగా అందించాలని వినతిపత్రం లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పై అంశాల పరిష్కారానికి కషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చెపినట్లు విద్యార్థులు చెప్పారు. ఈ కార్యక్రమంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ బీఎస్ఎఫ్ అధ్యక్షులు వేల్పుల సంజరు, నవతెలంగాణ విద్యార్థి సంఘం-ఎన్టీవీఎస్ అధ్యక్షులు కొత్తపల్లి తిరుపతి, బహుజన విద్యార్థి సంఘం- బీవీఎస్ ఉపాధ్యక్షులు పులిగంటి వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.