Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఈనేపథ్యంలో పోలీసుల సహకారంతో ఆదివారం ఓయూ 6వ నెంబర్ క్యాంపులో రెండు, జామై ఉస్మానియా వద్ద నిర్మాణంలో ఉన్న మరో ఇంటిని కూల్చివేశారు. అక్కడే ఆర్అండ్ కార్యాలయంలో అక్రమంగా ఉంటున్న ఒక ఓయూ ఉద్యోగిని వెళ్లి పోవాలని జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వరు, సీఎస్ఓ శ్రీరాం అంజయ్య ఘాటుగా హెచ్చరించారు. కాగా కూల్చివేస్తున్న తరుణంలో స్థానికులకు ఓయూ అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పర్యవేక్షణలో అక్రమ నిర్మాణాలను దగ్గరుండి కూల్చివేయించారు. అక్రమంగా నిర్మిస్తున్న నివాసాలపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో ఓయూ 9వ క్యాంపులో సుమారు 30 నుంచి 42 వరకు అక్రమంగా నిర్మాణాలు జరిగాయని, వాటినికూడా దశలవారీగా తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆఫీసర్ రామేశ్వర్ రెడ్డి, పోలీసు సిబ్బంది, ఓయూ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.