Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి. సాయిబాబా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిదని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా ఆరోపించారు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, చనిపోయిన కుటుంబానికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదివారం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా 15 నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం కరెంటు, వాటర్ బిల్లుల పేరిట ప్రజల వద్ద నుంచి బలవంతంగా వేల కోట్లు వసూలు చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ఇస్తామని, ఏకంగా నాలుగు నెలల బిల్లులు బలవంతంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగి పెదలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పట్టనట్టు చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేరు చెప్పి సర్కారు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్ముకుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పి.రవీంద్రాచారి, టీఎస్టీయూసీ అధ్యక్షులు ఎంకే బోసు, కట్ట రాములు, యాదగిరి రావు, భవాని శ్రీనివాస్, చంద్రమోహన్, ఉదరు గుప్త, ఎస్.ప్రకాష్, వైఎల్ నర్సింహా గౌడ్, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.