Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
సేవా కార్యక్రమాల్లో సైనికుల్లా పనిచేయాలని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సేవాహీ సంఘటన్లో భాగంగా ఆదివారం గాంధీనగర్ డివిజన్ యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రజా నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పావని వినరు కుమార్, నగర బీజేపీ సీనియర్ నాయకుడు ఎ.వినరు కుమార్, మహంకాళి జిల్లా సికింద్రాబాద్ యువమోర్చా అధ్యక్షులు మద్దూరి శివాజీ, బీజేపీ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రత్న సాయి చంద్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, ఉమేష్, సురేందర్, బాలకష్ణ, ఆనంద్ రావు, సంతోష్, రఘు యాదవ్, హర్ష, కార్తీక్, అభిషేక్, డేవిడ్ పాల్గొన్నారు.