Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్స్ కడల్స్ ప్రసూతి వైద్యురాలు శిల్పిరెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఏటా జూన్ 21 న జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో కిమ్స్ కడల్స్ హాస్పిటల్ హెడ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి వైద్యురాలు కె. శిల్పిరెడ్డి యాంత్రిక జీవనంలో యోగా ఉపయోగాలపై పలు సూచనలు చేశారు. కోవిడ్-19 ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థపై దాడిచేస్తుందని, ప్రాణాయామ, బ్రీతింగ్ వ్యాయామాల వల్ల రోగనిరోధక శక్తి ఆవశ్యకతను వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్మ విశ్వాసం పెంపొందించడంలో యోగా తోడ్పుతుందంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లోనే..'15 నెలల నుంచి కొనసాగుతున్న కరోనా మహమ్మారి నియంత్రించడంలో మనం గ్రహించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శారీరకంగా, మానసికంగా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారు కరోనాను నియంత్రించడంలో విజయం సాధించారు. ఒత్తిడితో కూడిన యాంత్రిక జీవనం గడుపుతున్న ఈ రోజుల్లో.. యోగా శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో అద్భుతమైన పాత్ర పోషించింది. కొవిడ్ వంటి భయంకరమైన వైరస్లను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిదే కీలక పాత్ర. ప్రాణాయామం అంటే శ్వాసను అనులోమ విలోమాను పాతంలో తీసుకోవడంతో పాటు బ్రమరీ వ్యాయామాలతో ఊపిరితిత్తులకు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులను నివారించడానికి చాలా ఏళ్ల నుంచి సహాయపడుతోంది. ముఖ్యంగా కరోనా రోగులకు ఇది ఎంతో సహాయపడింది. ఈ వ్యాయామం చేయడం ద్వారా కొవిడ్ నుంచి వేగంగా కోలుకుని ఊపిరితిత్తుల పనితీరును మెరుగవ్వడంతో ఈజీగా మహమ్మారిని జయించారు' అని అన్నారు.