Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకనే స్కూల్స్ ప్రారంభించాలని టీడీపీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వల్లారపు శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు. ఆదివారం సీతాఫలమండీలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట డివిజన్ అధ్యక్షుడు జీవీ కృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పూర్తయ్యేంతవరకు పిల్లల స్కూల్స్ తెరవొద్దన్నారు. లాక్డౌన్ కాలంలోని 3 నెలల కరెంట్, వాటర్ బిల్లులు మాఫీ చేయాలని, కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే నడ్డివిరుస్తున్నాయని, పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట టీడీపీ డివిజన్ అధ్యక్షులు గండికోట, విజరు కుమార్, తడక వినోద్, కాత విజరు, సీనియర్ నాయకులు లక్ష్మణ్, జగదీష్ గౌడ్, పొట్టి శ్రీను, జీఎం రమేష్, వెంకట స్వామి, విక్రమ్, అలెక్స్, పేపర్ శ్రీనివాస్, శ్రీనివాస్, సాయి, రాహుల్, బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.