Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సంఘటన మంత్రి శ్రీనివాస్
నవతెలంగాణ-హయత్‌నగర్
బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం మన్సూరాబాద్‌లో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా
(సంఘటన మంత్రి) మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ హాజరై డివిజన్లలోని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కషిచేయాలని సూచిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కషి చేయాలని, ప్రస్తుత కరోనా కష్టకాలంలో కూడా యావత్ ప్రజానీ కాన్ని ఏవిధంగా ఆదుకుందో రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక కార్యాచరణ లను చేపడతామని తెలిపారు. ఏదైతే లాక్డౌన్ ప్రక్రియ ముగిసిందో కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, నల్ల బిల్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ఎన్నికల సందర్భంగా నగరంలోని ప్రతి ఇంటికి తాగునీరు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అర్హతగల లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆధార్ ప్రామాణీకరణ చేయించు కోవాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు మరల తిరిగి నల్ల్లా బిల్లులు చెల్లించాలని వేల రూపాయలు ప్రజల నెత్తిన పడేసారు. ఈ రెండు విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కార్యాచరణ చేపట్టి ప్రజానీ కానికి భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, ఉపేందర్ రెడ్డి, గోవర్దన్ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ వంగమధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్యానేంద్రప్రసాద్, అర్బన్ జిల్లా కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం జీవంరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, లచ్చి రెడ్డి, బానోతు సుజాత, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నరసింహగుప్త, పవన్ కుమార్ చింతల అరుణ, సురేందర్, రాధా ధీరజ్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, అంజాన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మొండ్రా సంగీత డివిజన్ అధ్యక్షులు జిల్లా పదాధికారుల రాష్ట్ర పార్టీ పదాధికారుల పాల్గొన్నారు.