Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడి ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డ ఈ విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్, ఇంటర్ నేషనల్ స్కూల్స్, కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజుల దోపిడీతో తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ కష్ట కాలంలో కాసుల కక్కుర్తితో మరింత ఆందోళన లోకి నెడుతున్నాయని ఏబీవీపీ నేతలు అన్నారు. ఏబీవీపీ ఓయూ విభాగ్ కన్వీనర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుమన్ శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ శ్రీహరి ఎన్ఈసీ మెంబర్ శ్రీశైలం మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత సంవత్సరం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా సంస్థలు ఫీజులు పెంచొద్దని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని, అది కూడా నెలవారీగా తీసుకోవాలని సూచించి ఆ ప్రకారం జీఓ 46 జారీ చేసినా రాష్ట్రంలో ఏ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ముఖ్యమంత్రి ప్రకటనను, ప్రభుత్వ నిబంధనలను ఖాతరు చేయకుండా నిర్భయంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యనందించి సామజిక బాధ్యతగా వ్యవహరించే యాజమాన్యాల స్థానంలో కేవలం ధనార్జనే తమ ధ్యేేయంగా ఏర్పాటైన కార్పొరేట్ విద్యాసంస్థలు ఒకే అఫిలియేషన్ పేరుతో వందల బ్రాంచ్‌లు, ఒకే ర్యాంక్‌ను అన్ని బ్రాంచ్‌లకు అన్వయి స్తూ, అనేక ఆకర్షిల పేర్లతో తల్లిదండ్రులను అయోమ యానికి గురిచేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తూ అడ్మిషన్ నుండి పరీక్షల వరకు లక్షల్లో అక్రమంగా ఫీజుల దోపిడీ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నారాయణ, శ్రీ చైతన్య, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, మెరిడియన్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్, ఒక్రిడ్జ్, శ్రీనిధి, వికాస్, చీరేక్ ఇలా పేరుమోసిన అనేక పాఠశాలలు గతంలో సాధారణ పరిస్థితుల మాదిరిలా ఏ మాత్రం ప్రభుత్వ నిబంధ నలు పాటించకుండా ప్రభుత్వ అండదండలతో, కొందరు అవినీతి విద్యా శాఖ అధికారుల లోపాయి కారి ఒప్పందాలతో విద్యా వ్యాపారాన్ని స్వేచ్ఛగా విస్తరించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వం ద్వారా తమ విద్యా వ్యాపారానికి అనుకూలంగా జీఓలు విడుదల చేయించుకునే స్థాయిలో ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయంటే విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందొ అంచనా వేయొచ్చు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా రంగంలో ముందు వరుసలో నిలుపుతామని, కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రిస్తామన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం నలు మూలల విస్తరిస్తున్న కార్పొరేట్ మాఫియాను నియంత్రించకపోగా ప్రోత్సహిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర టెక్నికల్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాస్, ఎస్ఎఫ్ఓ కన్వీనర్ శివ శంకర్, మహేష్ పాల్గొన్నారు.