Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు నిరసనగా ఆదివారం నాడు కంటో న్మెంట్ టీడీపీ ఆధ్యర్యంలో బోయిన్పల్లి టీడీపీ కార్యాలయంలో నాయకులు మౌనదీక్ష చేశారు. టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజిక వర్గ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్, నాయకులు అశోక్ యాదవ్ వర్సెస్ రాజు, శ్రీరాములు యాదవ్, జయరాజ్ ముదిరాజ్ వెంకటేష్, ఎస్కె. బాబు, వెంకట్రావు, రవీందర్ ప్రమోద్, చంద్రశేఖర్, నాగరాజుగౌడ్ పలువురు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేకపోయిందని విమర్శించారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఓ పక్క లాక్డౌన్తో ఉద్యోగాల్లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే కంటోన్మెంట్ ప్రాంతంలో మూడు నెలలకు సరిపడా వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అంతేకాకుండా పాఠశాలల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా చిన్న పిల్లల పాఠశాలలు కూడా తెరుస్తున్నారని, ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికీ కంటోన్మెంట్లో వ్యాక్సిన్ కొరత ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.