Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పేకాట జోరుగా సాగుతున్న శిబిరాలపై ప్రత్యేక నిఘా విభాగం ద్వారా పక్కా సమచారంతో వారందరినీ అదుపులోకి తీసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ వివరాలు ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..
మోహిద్ కబీర్(67)ఎ1, ముద్దాయిగా నిర్మాణ సంస్థ రంగంలో పనిచేస్తూ హఫీజ్పేట్ నివాసితులు సయ్యద్ మిరాజ్ అలి(35) ఎ2, ఏ సెవెన్ వరకు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ మహమ్మారి కష్టాలలో ఉంటే వీరు మాత్రం తీన్ పత్తి ఆటలాడుతూ ఇష్టానుసారంగా బెట్టింగ్లు చేస్తూ ఆస్తులు అమ్ముకునే పనిలో పడ్డారు.
పక్కా సమాచారంతో ముందస్తు ప్రణాళిక రచించుకున్న పోలీసులు సాక్ష్యాధారాలతో సహా వీరిని కౌసర్ కాలనీ బంజారాహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 11,500 నగదు 7 సెల్ఫోన్లు 56 కార్డుల సెట్టులను స్వాధీనపరచుకొని రిమాండుకు తరలించారు.