Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
తెలంగాణా రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ దాని కోసం అవిరళ కషిచేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. సోమవారం నాడు నియోజక వర్గంలోని గాంధీ నగర్ డివిజన్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా గాంధీ నగర్ డివిజన్లో ఎఎంపిఎం హోటల్ దగ్గర జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ 1952 ముల్కీ ఉద్యమం నుండి తెలంగాణా ఏర్పాటుకి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి వారిని ఉద్యకారులుగా మార్చి తెలంగాణా ఏర్పాటుకి ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఒక ప్రముఖ విద్యావేత్తగా, సామాజిక వేత్తగా, తెలంగాణా సిద్ధాంత కర్తగా తెలంగాణా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవల్ని గౌరవించి ఆయన పేరుతో ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, యువ నాయకుడు ముఠా జై సింహ, ముఠా నరేష్, గాంధీ నగర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గుప్త, ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీకాంత్, లక్ష్మిగణపతి, చైర్మెన్ ముచ్చకుర్త్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్, జి.పరశురామ్, మరిసెట్టీ నరసింగావు, షేక్ జహంగీర్,పాశం రవి, వస్తరి విఠల్, ప్రేమ్, సంతోష్, అజరు, సుధాకర్ గుప్తా, రవి శంకర్ గుప్త, టిీ. యాదగిరి, పి.రాజ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, ఎండి గౌస్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.