Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెేపీ వివేకానంద్ అన్నారు. గ్రేటర్ మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న వాటర్ కనెక్షన్ గృహ వినియోగదారులకు ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందిస్తున్న నేపథ్యంలో బల్క్ సప్లయర్స్‌కు కూడా ఉచితంగా తాగునీరు అందించేలా జలమండలి అధికారిక లెటర్ ఇవ్వడంపై సోమవారం సుభాష్‌నగర్ డివిజన్ ఎస్‌ఆర్‌నాయక్‌నగర్, అపురూపకాలనీ, జనప్రియ అపార్టుమెంట్స్, మోడీ బీల్డర్స్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ను, మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి సమస్యతో ఎవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రతి గృహ వినియోగదారుడు తప్పనిసరిగా పని చేస్తున్న వాటర్ మీటర్ కలిగి ఉండడంతో నాటుగా వాటర్ కనెక్షన్ కన్య్సూమర్ అకౌంట్ నంబర్‌తో వారి ఆధార్ కనెక్షన్ లింక్ చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌నాయక్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొగంటి శ్రీనివాస్‌రావు, కమిటీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, అపూరూపకాలనీ అధ్యక్షులు గణేషన్, రమణ, సత్యనారాయణ, మోడీ బిల్డర్స్ అధ్యక్షులు లింగారావు, చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు