Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి పసుల అంజయ్య డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లో ప్రయివేటు పాఠశాలలో అధిక ఫీజులు తగ్గించాలని నిరసన తెలిపారు. ఫీజులు కట్టని పక్షంలో తరువాత తరగతికి ప్రమోట్ చేయమని, ఫీజలు చెల్లించాలని లేనిచో పర్సంటెజ్ తక్కువగా చూపిస్తామని పాఠశాలల యజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పుతున్నారన్నారు. ఒకే సారి లక్షలు, వేలు ఫీజులు చెల్లించాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ క్లాసులన్ని ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల డీవైఎఫ్ఐ అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు.