Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
గుర్తుండిపోయేలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్నవారు బాధ్యతాయుతంగా ఒక మొక్కను నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని లోటస్ పాండ్ పార్కులో తన జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలునాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరూ తలపెట్టినా దానిని స్వీకరించాల్సిన బాధ్యత బాధ్యతాయుతమైన వ్యక్తులపై ఉంటుందని ఆమె అన్నారు. తలసేమియాతో బాధపడుతున్న రోగులకోసం రక్తదాన కార్యక్రమాన్ని కూడా తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశానన్నారు. ఈ సహకారాన్ని అందిస్తున్న నగర ప్రజలు ముఖ్యంగా తన డివిజన్ పరిధిలోని ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌ను బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆనంద్ కుమార్, ఉదరు కుమార్ రెడ్డి, సరళలు కలిసి తమ సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. సినీహీరో తరుణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ, డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవనాయక్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్ ఇన్స్పెక్టర్ శివ చంద్ర, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, సర్కిల్ 18 ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కేక్‌కట్ చేసి మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.