Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సీసీ రోడ్లు, అండర్ డ్రయినేజీ పనులు ప్రారంభం
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్రంలోనే పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం పీర్జాదిగూడలోని వివిధ డివిజన్లలో రూ. 1.54 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేయడం వల్ల పట్టణాలు అభివృద్ధిచెందుతాయని, అది పీర్జాదిగూడలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అంతకుముందు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దారు ఎస్తేర్ అనిత, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు బచ్చరాజు, తూంకంట్ల ప్రసన్నలక్ష్మి, పప్పుల రాజేశ్వరిఅంజిరెడ్డి, సుభాష్ నాయక్, వీరమల్లు సుమలత, ప్రసన్న లక్ష్మి, కౌడే పోచయ్య, అనంతరెడ్డి, శారదా ఈశ్వర్ రెడ్డి, కుర్ర శాలిని, నాయకులు పాశం బుచ్చియాదవ్, తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, బండి సతీష్, కుర్ర శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్ జ్యోతి, ఏఈ వినీల్, రెవెన్యూ ఆఫీసర్ అనిల్ కుమార్, టీపీఎస్ పావని, ఆర్ఐ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.