Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రంగారెడ్డిబండ, యాదిరెడ్డిబండలలో నెలకొన్న సమస్యలపై అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన రోడ్లను పరిశీలించారు. ఈసందర్భంగా రంగారెడ్డిబండలో 25/1 సర్వే నంబర్లో ఉన్న 5.15 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, జలమండలి కార్యాలయం, కమిటీ హాల్ వంటి ఏర్పాటుకు స్థలాన్ని వినియోగించాలని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించిన ఆయన రెవెన్యూ సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకొవచ్చని, డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, డీజీఎం రాజేష్, ఎలక్ట్రికల్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ సురేందర్నాయక్, వార్డు సభ్యురాలు ఇందిర, కొండయ్య, లక్ష్మయ్య, సాయికిరణ్గౌడ్, వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.