Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో రూ.10 లక్షల 60 వేల నిధులతో చేపడుతున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నీటి సమస్యను శాశ్వతంగా నివారించేందుకు పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈసంతోష్, ఏఈ శ్వేత, వర్క్ఇన్స్పెక్టర్ దుర్గ, టీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, ఆమనూరి సతీష్, బాబ్లీ, రాగుల ప్రవీణ్‌కుమార్, మహేష్‌ముదిరాజ్, మల్లికార్జుయాదవ్, మహేష్ గంగపుత్ర, సింహాచలం, పాక నర్సింగ్, జారు, సూరి, ఉదరుగౌడ్, ఎండి గౌస్, బాలరాజు, జాకీర్, ముంతాజ్‌బేగం, షాహీన్, యూసుఫ్ బాబా, రఫీ ప్రకాష్, శ్రీనివాస్ గుప్త,మోసిన్ రాజు, నాగరాజు, లక్ష్మణ్, జమీల్, విష్ణు, గోల్డ్ శీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.