Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
యోగాతో అన్నింటినీ జీవించవచ్చని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మెన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాడ్ లైఫ్‌కు చెందిన యోగా గురువులు డా.ఉదయకుమార్, డా.భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో యోగాసనాలు సాధన చేయిస్తూ వాటి ప్రాధాన్యతను వివరించారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఏర్పడే ఒత్తిడిని నియంత్రించడానికి, దాని వల్ల ఏర్పడే దుష్ఫలితాలు తగ్గించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఊపిరితిత్తులను బలోపేతం చేయడంలో కూడా యోగా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యోగా గురువులు డా.ఉదయకుమార్, డా.భరత్ రాజ్, కార్యక్రమ నిర్వాహకులు యాడ్ లైఫ్ నేచురోపతి విభాగాధిపతి డా.సుమతి లను ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో యాడ్ లైఫ్ విభాగాధిపతి డా.కల్పనా రఘునాథ్, సీఈఓ డా.ఆర్వీ ప్రభాకర రావు, ట్రస్టు బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, సీఓఓ రవికుమార్, డా.టీఎస్ రావు, మెడికల్ డైరెక్టర్ డా.ఫణి, మెడికల్ సూపరింటెండెంట్ కోటేశ్వర రావు, ఆసోసియేట్ డైరెక్టర్ కల్పనా రఘునాథ్ పాల్గొన్నారు.