Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు అరెస్ట్ 36 ఏంపోటెరిసిన్-బి ఇంజెక్షన్ల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే ఏంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురు నిందితులను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సిటీ పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్ సీపీ షిఖాగోయెల్, డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్రావుతోకలిసి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన కొండూరు క్రాంతి కుమార్ మెడిక్సి ఫార్మా కంపెనీని కొనసాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శంకరీ ఫార్మా యజమాని నంగునూరి వెంకట్ దినేష్, బాలాపూర్‌కు చెదిన శికాకోలా శ్రీనివాస్, బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని ముగ్గురూ కలిసి ఈజీ మనికోసం ఏంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రూ. 7,444లకు ఒక ఇంజెక్షన్‌ను రూ. 35 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎండీ అబ్దుల్ జావీద్ ప్రత్యేక నిఘావేసి నిందితులను అరెస్టు చేశారు.