Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, సిబ్బంది చూడాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి సూచించారు. సోమ వారం తార్నాకలోని ప్రొఫెసర్ కోదండరాం నివాసం వద్ద విరిగిన చెట్లు, కూలిన స్తంభాలను టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. హుటాహుటిన అధికారులు, సిబ్బందిని పిలిపించి విరిగిన చెట్లు, వంగిన స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాలులు, వర్షాలకు స్తంభాలు కూలడం, చెట్లు విరగడం జరుగుతుంటాయనీ, వర్షం నీరు ఎక్కడ రోడ్లమీద గల్లీల్లో నిలువకుండా చూడాలని అధికారుల ను కోరారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్త ంగా ఉండి సమస్యలను గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్, తన కార్యాలయానికి సమాచారం అందిం చాలని సూచించారు.