Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వ్యాక్సిన్ ఇస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. అన్ని వ్యాక్సిన్ సెంటర్లలో ప్రధానమంత్రి ఫొటో సైతం ఏర్పా టు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ప్ల కార్డు లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో టీఆ ర్ఎస్ ఏ టీకాల పేటెంట్ హక్కుల మాదిరిగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ నిధులు దేశ ప్రధాని ఫోటో ఏ వ్యాక్సిన్ సెంటర్లలో కానరాని పరిస్థితి చూస్తే సొమ్ము కేంద్రంది సోకు రాష్ట్ర ముఖ్య మంత్రిది అనేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికా రులు, వ్యవహరించే తీరు సరికాదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చట్టప్రకారంగా వ్యవహరించా లన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఏ నిధులతో వెచ్చిస్తు న్నది ఓ ఐఏఎస్ అధికారికి, ప్రతినిధులకు తెలియంది కాదన్నారు. కేవలం ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే టీకా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు టీకాల విషయంలో సమన్వ యంతో వ్యహరించాల్సిందే పోయి ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారన్నారు. రాష్ట్రమే నిధులు వెచ్చిస్తున్న ట్టు కేవలం కేసీఆర్ చిత్రపటాన్ని వేసుకోవడం ప్రజల్లో టీకాల పై విధంగా ప్రచారం చేస్తున్నట్టు అందరికీ అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా వెంటనే అఖిలభా రత భారతీయ సర్వీస్ అధికారి తెలియజెప్పే విధంగా సూచనలు ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలనీ, కేంద్ర ప్రభుత్వం అమలుపరిచే ఆరోగ్య భద్రత ఆయుష్మాన్ భారత్ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సి నేషన్ కేంద్రాల్లో ప్రధానమంత్రి ఫోటో ఉండే విధంగా చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర మహిళా ప్రముఖ ఆమలశ్వరి, ఎస్సీ మోర్చా రాష్ట్ర స్కాలర్షిప్ సెల్ జెయి ంట్ కన్వీనర్ నాగరాజు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రామ చంద్రనాయక్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అమతాయ, సేవ ఈ సంఘటన కో కన్వీనర్ సుమన్రా వు, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్రచౌదరి, ఉపా ధ్యక్షులు శివ కోటేశ్వర్చౌదరి, సెక్రెటరీ లక్ష్మణ్, సత్య నారాయణ, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ఓబీసీ మో ర్చా అధ్యక్షులు మదన్, కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులు నరేష్ గుప్తా, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముఖేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.