Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జీహెచ్ఎంసీ సర్కిల్-19 కార్యాలయంలో సోమవారం టీఆర్ఎస్ కార్మిక విభాగం నూతన సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఏండ్లుగా జీహెచ్ఎంసీ సర్కిల్-19లో సంఘం కార్యాలయం పురాతన భవనంలో నిర్వహిస్తున్నారనీ, తమకు నూతన భవనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చి, నిధులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా, అధికారులు అక్రమంగా కార్మికులను తొలగించినా సంఘం దృష్టికి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మిక సంఘం నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే సంఘాలను ఏర్పాటు చేసి టీిఆర్ఎస్కేవీ పోరాడుతుందన్నారు. ఈ సంఘంలో జీహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికులు వై.యాదగిరి, సలీం, జంగయ్య, రమేష్, గౌస్, శ్రీనివాస్, మల్లేశ్వరి, ఆనంద, మంజుతో పాటు మరో 40 మంది కార్మికులు చేరారు. వారిని సంఘం నాయకులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సంఘానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని నిరంతరం సహాయ సహకారాలు అందిస్తానని సంఘం నాయకులు, కార్మికులకు హామీనిచ్చారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ గ్రేటర్ అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరాజు, హరిరామ్, మల్లేష్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.