Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇండ్లను నిర్మించుకునేందుకు పనులు చేపడుతుండగా కొందరు అక్రమార్కులు తమను అడ్డుకుంటున్నారని కీసర గ్రామానికి చెందిన రామిడి విజరు కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కీసర మండలం చీర్యాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 110 ,112లో కొన్ని ప్లాట్లు గతంలో కొనుగోలు చేశామనీ, అందులో ఇండ్ల నిర్మాణాలు చేసుకునేందుకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. నిర్మాణాలు చేపట్టేందుకు అక్కడికి వెళ్లగా కొం దరు అక్రమార్కులు పనులు జరగనీయకుండా అడ్డుప డుతూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్థలంపై 2016లో న్యాయస్థానంను ఆశ్రయించగా తమకు డిగ్రీ ఉత్తర్వులు ఇచ్చారనీ, ఈ విషయం పోలీసులు కూడా తెలిపామన్నారు. అన్ని అనుమతులు ఉన్నపటికీ అక్రమార్కులు గుండాలతో, సెక్యూరిటీ గార్డులతో బెదిరిస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగ పరిచేలా వ్యవహరిస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాము కొనుగోలు చేసిన ప్లాట్‌లో ఇల్లు నిర్మించుకునేందుకు పోలీస్ అధికారులు సహక రించాలని వేడుకున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను అక్ర మార్కులు బేకాతరు చేస్తున్నారనీ, న్యాయంగా ప్లాట్లు కొను గోలు చేసిన మమ్ములను బెదిరిస్తున్నారనీ, ఇలాంటి అక్రమా ర్కులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని సామా న్య ప్రజలైన తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.