Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం మొక్కలు నాటి సంరక్షించాలి
- జిల్లాలో అధికారుల టీం పనులు బాగున్నాయి
- రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా లనీ, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చి మొక్కలు నాటి జిల్లాను పచ్చదనంగా ఉంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా సోమవారం జిల్లాలోని కీసర మండల కేంద్రంలోని జీపీఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ ఛైర్మన్ శర త్ చంద్రారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీ పీలు, సర్పంచులు, మేయర్లు, ఛైర్మన్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో కలెతక్టర్, జిల్లా అధికారుల టీం ఎంతో బాగుందన్నారు. వారు అన్ని పనులు బాగా చేస్తూ జిల్లాకు మంచిపేరు తీసుకువస్తున్నారని మంత్రి అభినందించారు. ప్రభుత్వం, సీఎం కేసీ ఆర్ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనీ, పచ్చ దనం వెల్లివిరిసేలా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభు త్వానికి చెందిన ఖాళీ ప్రదేశాల్లో పండ్లు, పూలనిచ్చే మొక్క లతో పాటు నీడనిచ్చే మొక్క లను నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. అనుకున్న లక్ష్యాన్ని తప్ప కుండా పూర్తి చేయాలన్నారు. మొక్కలను పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు సకాలంలో వర్షాలు కురుస్తా యనీ, మంచి ఆహ్లాదకర వాతా వరణం ఉంటుందన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఇంటి వద్ద మొక్కలు నాటేం దుకు నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా ప్రజలకు అవస రమైన పూలు, పండ్ల మొక్కలను అందజేస్తామని తెలిపారు. జెడీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అటవీ సంరక్షణ పట్ల ఎంతో దృష్టి సారించిందనీ, మొక్కల ను పెంచడం వల్ల అటవీ సంపద పెరుగుతుందన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు జియో ట్యాగి ంగ్ చేయాలని సంబంధిత అధికా రులను ఆయన ఆదేశి ంచారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి మాటా ్లడుతూ ఏడో విడత హరితహారంలో భాగం గా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యులను చేసి అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని పేర్కొ న్నారు. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నర్సరీ లను ఏర్పాటు చేసి వారికి అవసరమైన మొక్కలు ఉచిత ంగా అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించినందున ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు చేయగా కరోనా వల్ల మరికొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయల దనీ, యుద్ద ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సి ందిగా ఆదేశించారు. ప్రభుత్వం గ్రామాలకు అందచేసిన ట్రాక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను సేకరించాలని సూచి ంచారు. పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా లోని అన్ని మండల కేంద్రాల్లో పదె ఎకరాల చొప్పున భూమి ని ప్రభుత్వం అందచేస్తోందన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు జిల్లాలోని గ్రామాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెత్తసేకరణ వంటి విషయాల్లో మేడ్చల్-మల్కా జిగిరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాల న్నారు. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో 13 వెజ్, నాన్వె జ్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతి పాదనలు సిద్దమయ్యా యనీ, వీటికి సంబంధించి భూముల కేటాయింపు పూర్తయ్యింద ని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంలో పారిశుధ్యం, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ వంటి విషయాల్లో ప్రత్యే క దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వం, సీఎం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొనాలనీ, వారానికి రెండు రోజులు ఈ కార్యక్ర మం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ఛైర్మన్ వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో దేవసహా యం, డీఆర్డీఏ పీడీ, జిల్లా అధికారు లు, ఆర్డీవోలు, ఆయా మండలాల జెడ్పీటీసీలు, కీసర ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారా యణ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కీసర సర్పంచ్ మాధురి, సర్పంచులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, పాల్గొన్నారు.