Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాన్సర్ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
- తలసేమియా బాధితుల కోసం భారీ రక్తదానం శిబిరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని మొక్కలు నాటి, రక్తదానం చేశారు. క్యాన్సర్ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. మేయర్తోపా టు రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్, సినీ నటు డు తరుణ్ తదితరులు మొక్కలు నాటారు. అనం తరం మేయర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచ నల మేరకు పచ్చదనాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టు కున్నామని చెప్పారు. 2021లో హరితహారం కార్యక్ర మం కింద 1.5 కోట్ల మొక్కలను పంపిణీ చేయడమే తమ టార్గెట్ అన్నారు. అనంతరం మేయర్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ణు కలిసి ఆశీర్వాదం తీసుకు న్నారు. సినీ నటులు నందమూరి బాలకష్ణతో కలిసి బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. బలహీనమైన, క్యాన్సర్ ప్రభావిత పే దలకు సేవలు, సాయం అందించడంపట్ల బసవ తా రకం బందాన్ని ఆమె ప్రశంసించారు. నందమూరి బాలకృష్ణ విజయవంతంగా ఆస్పత్రిని నడుపుతూ.. అవసరమైన వారికి చికిత్స అందిస్తున్నందుకు కృతజ్ఞ తలు తెలిపారు. నందమూరి బాలకష్ణ మేయర్ గద్వా ల్ విజయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
భారీ రక్తదాన శిబిరం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తలసేమియా రోగులకు సాయం అందిస్తామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఖాజా మాన్షన్‌లో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో టీహెచ్ఎంసీ టీమ్‌తో కలిసి బ్లడ్ డొనేట్ చేశారు. సినీనటుడు నిఖిల్ కూడా బ్లడ్డొనేట్ చేసి రక్త శిబిరానికి మద్దతునిచ్చారు. సరైన సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడంపట్ల ఆయన మేయ ర్ను ప్రశంసించారు. మేయర్ విజయలక్ష్మి సేవలను అదే స్ఫూర్తిదాయకంగా కొనసాగిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.