Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ-కూకట్పల్లి
దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అన్నారు. సోమవారం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటించిన సంద ర్భంగా బండి సంజరు కూకట్ పల్లిలోని ఎన్కెఎన్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించిన డిసెంబర్ లోపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే అనేక వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ వాక్సినేషన్ అందుబాటులోకి ఉంచాలన్నారు. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటో లేకపోవడం విచారకరమ న్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయాలని నిర్ణయించి నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదన్నారు. కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ కేసీఆర్ ఒక్కసారి కూడా చెప్పలేదనీ, కృతజ్ఞతా భావం కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ బీజేపీ అధ్య క్షులు హరీష్‌రెడ్డి, మూసాపేట్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, కూకట్పల్లి అసెంబ్లీ ఇన్చార్జి కాంతారావు, నియోజకవర్గ కార్యకర్తలు, పాల్గొన్నారు.