Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటు కళాశాల్లో అక్రమంగా అధిక ధరలకు స్టడీ మెటీరియ ల్ని విద్యార్థులు తక్షణమే కొనుగోలు చేయాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారని బీజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యద ర్శులు మారం శ్రీదర్, జితేందర్, బండి దీక్షిత్, జైసా యిలు ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డిజిల్లా రీజినల్ ఇన్స్పెక్టర్ ఏంక్య నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల పేరుతో విపరీతంగా ఫీజులు వసూ లు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లి దండ్రులను భయాందోళనకు గురిచేస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు చదువును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జీవో 46ను వెంటనే అమలు చేసి విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజుగా 50 శాతం తీసుకునే విధంగా, ఆన్లైన్ తరగతుల నెపంతో అధికంగా వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజెవైఎం నాయకులు పాల్గొన్నారు.