Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
ఈ నెల 24వ తేదీరన ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్‌ను వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సందర్శించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల హాస్పి టల్ సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ ఆధ్వర్యంలోని పలు విభాగాలకు చెందిన ఆస్పత్రి వైద్యులు మంత్రి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్‌కు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ప్రభుత్వ వైద్యసేవలను అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి చెస్ట్ ఆస్పత్రిని సంద ర్శించి హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రణాలికలను రూపొందిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పల్మ నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్, అనస్తీషియా ప్రొఫెసర్ అభిమన్యు, సుజాత, ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, సీమా తబస్సుం, నర్సింగ్ సూపరింటెండెంట్ మార్గరెట్, సిటీ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అనిత బల్లా ఉన్నారు.