Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
మేడ్చల్ జిల్లాలో రజక వత్తిదారులు అందరూ ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, రజక వత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అంబే చక్రపాణి, ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రజక వత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లాలో గత కొన్ని నెలలుగా చేసిన నిరసన దీక్షలు, ఇంటి వద్ద దీక్షలు, ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు, బీసీ అభివద్ధి జిల్లా అధికారికి వినతి, జిల్లా కలెక్టర్కు వినతులు, ఆందోళన, పోరాటాల ఫలితంగా ప్రభుత్వం గుర్తించి ఉచిత విద్యుత్ పథకం రూపకల్పన చేయడం జరిగింది. రజక, నాయి బ్రాహ్మణ సంఘాల పోరాటాల కషివలన, రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ తీసుకు రావడాన్ని సంతోషం వ్యక్తం చేశారు. రజక, నాయి వత్తిదారులకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ను తీసుకొచ్చి కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, 3 నెలల అడ్వాన్స్, రెంటల్ అగ్రిమెంట్ తదితర అంశాలు పెట్టడం వల్ల పథకానికి రజక, నాయి, వత్తిదారులు దూరమవుతారని చెప్పిన పిమ్మట జీవోను అనుసవరించి సులభతరం చేయడం జరిగింది. దరఖాస్తుకు ఆధార్ కార్డు, కుల దవీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్ ఫోటో సైజ్ ఫోటో, ఇస్త్రీ లేదా డ్రై క్లీనింగ్, హెయిర్ కటింగ్ వత్తి చేస్తున్న ఫోటో, ఇంతకు ముందు ఉన్న కరెంటు బిల్లు పాతవి, ఐడిhttp//tsobmms.cgg.gov.in ఆన్ లైన్లో చివరి తేదీ 30-6-2021 వరకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా, గత కొన్ని నెలలుగా తెలంగాణ రజక వత్తిదారుల సంఘం చేసిన ఆందోళన పోరాటాల ఫలితంగా ఈ పథకం సాధించామని వారు అన్నారు. కాబట్టి ఈ పథకాన్ని రజక, నాయి, వత్తిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. కార్యక్రమంలో ఎ.సదయ్య పి.సారయ్య నాంపల్లి ఈశ్వర్, కె.కష్ణ ఎ.రవి, ఎన్ రమేష్ కె. క్రాంతి,
ఓ. రాజు పాల్గొన్నారు.