Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ఈటల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వంపై దానికి పోరాటం చేయడానికి బీజేపీ పార్టీ వేదిక ఎన్నుకోవడం ఎంతో హర్షించవలసిన విషయం. రాబోయే ఎన్నికల్లో ఈటల గెలుపు కోసం నిజాంపేట్ బీజేపీ నిరంతరం కషి చేసి పనిచేయనున్నట్లు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నాయకులు ఆకుల సతీష్ తెలిపారు. బీజేపీలో సభ్యత్వం తీసుకున్న మొదటిసారి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు అందరూ కలిసి పూల బొకేలు ఇచ్చి
శుభాకాంక్షలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ హుజురాబాద్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకుడైన ఈటల రాజేందర్ అఖండ మెజారిటీతో గెలవడానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తామని వారు పార్టీని మరింత మంచి స్థాయికి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తారు. కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, మైనార్టీ మోర్చా మహిళ నాయకురాలు ఆమలేశ్వరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రామచంద్రనాయక్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్రచౌదరి, ఉపాధ్యక్షులు శివ కోటేశ్వర రావు చౌదరి, కార్యదర్శి అనిత, లక్ష్మణ్, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి స్థాయి, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్ ప్రధాన కార్యదర్శి ముఖేష్, కార్యవర్గ సభ్యులు శివ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.