Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
గ్రామ అభివృధ్ధికి తగిన కృషిని అందించనున్నట్టు ఎదులాబాద్ సర్పంచ్ కాలేరు సురేష్ అన్నారు. మండ లంలోని ఎదులాబాద్ గ్రామంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నానని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలి పారు. గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేసేందుకు ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తు లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. మండలం లోనే ఎదులాబాద్ గ్రామ పంచాయతీ చాలా పెద్దదనీ, కరోనాతో దాదాపు గ్రామంలో 12 నుంచి 15 మంది మృతి చెందారనీ, గ్రామంలో వ్యాక్సిలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఉపసర్పంచ్ ఉప్పు లింగేశ్వర్ కోరా రు. గ్రామంలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయనీ, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గట్టగళ్ల రవి, కందుల సరళ, వార్డు సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గుండ్ల ఆంజనేలు, రామ్‌చందర్, కందుల మంజుల సురేష్, నందకుమార్, కార్యదర్శి నర్సింగారా వు, కో-అప్షన్ సభ్యుడు ఎక్బాల్, సహకార బ్యాంక్ డైరెక్టర్ ధర్మారెడ్డి, ఉదరుకూమార్, మాజీ ఎంపీటీసీ మంకం రవి, నాయకులు కుమార్ పాల్గొన్నారు.