Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోన్‌కు 25లక్షల చొప్పున లక్ష్యం
- నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'తెలంగాణకు హరితహారం' కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ స్థాయిలో నిర్వహించాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. అయితే గతేడాదితో పోలిస్తే కోటి మొక్కలు తగ్గించి ఈ ఏడాది లక్ష్యంగా నిర్ధేశించారు. 2020లో 2.50కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానిలో 2.19కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. ఈ సారి మాత్రం 1.50కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే హరితహారం కార్యక్రమం నిర్వహణపై మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
ట్రీ పార్కుల ఏర్పాటు
గ్రేటర్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించాలని, ఉష్ణోగ్రతలను తగ్గించాలని, ఆక్కిజన్ శాతాన్ని పెంచడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగానే అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్, గ్రేవియార్డు ప్లాంటేషన్ ద్వారా ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. 2020లో 2.50కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని 2.19కోట్ల మొక్కలు నాటారు.406లేవుట్ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి 'ట్రీ పార్కులు'గా ఏర్పాటు చేశారు. వీటిల్లో సందర్శకులు, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్‌లు, కూర్చొవడానికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. మరో 45ప్రాంతాల్లో యాదాద్రి నాచురల్ ఫారెస్ట్ మోడల్(మియావాకి) తరహాలో మొక్కలు నాటారు. ఇప్పటి వరకు 9.54లక్షల మొక్కలను నాటారు.
600 నర్సరీల ద్వారా
ఈ ఏడాది నిర్వహించనున్న హరితహారం-2021 కార్యక్రమంలో జోన్‌కు 25లక్షల చొప్పున ఆరు జోన్లలో 1.50కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొక్కలను గ్రేటర్ పరిధిలో 600నర్సరీల ద్వారా పంపిణీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ నర్సరీల్లో ఏఏ మొక్కలు ఉన్నాయి? ఏ జోన్‌కు ఏఏ రకాల మొక్కలు కేటాయించాలి? అనే విషయాలను 'గ్రీన్ హైదరాబాద్' వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
నాలుగేండ్లలో...
తెలంగాణ రాష్ట్రంలో నాలుగేండ్లలో 3.21కోట్ల మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. నాటిన, పంపిణీ చేసిన మొక్కలు మాత్రం 2.76కోట్లు మాత్రమే. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.