Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-హస్తినాపురం
కప్రాయి చెరువు అభివృద్ధికి రూ.93 లక్షల నిధులు కేటాయించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని కప్రాయి చెరువును అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ కాంప్లెక్స్ నుంచి కాప్రారు చెరువులోకి వచ్చే వరదనీటిని మళ్లీంచేందుకు, గేట్ల నిర్మాణం కోసం మొత్తం రూ. 93 లక్షల నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో చెరువు నిండి పక్క కాలనీలు జలమయమయ్యేవని, దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండెంచెల ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో డివిజన్ ప్రజలకు వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం వైపుగా నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరామని కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు అనిల్ చౌదరి, త్రినేత్ర, ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మెన్ శ్రీధర్ గౌడ్, డైరెక్టర్ ఉమేష్ గౌడ్, గంగం శివ శంకర్, అశోక్ రెడ్డి, రాఘవేంద్ర రావు, నరేందర్ గౌడ్, రాంబాబు, సంతోష్, వెంకట్ రెడ్డి, రామాంజనేయులు, డివిజన్ సీనియర్ మహిళా నాయకురాలు సువర్ణరెడ్డి, నాగమణి రెడ్డి, సరస్వతి, పద్మ, స్వప్న, హరిహర పురం కాలనీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు శంకరయ్య, సెక్రటరీ జనార్దన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ, వివిధ కాలనీల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాంబాబు, బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ముడుపు సందీప్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు, పార్టీ నాయకులు శరత్, సుధీర్, కామేష్, కిరణ్ రెడ్డి, శ్రావణ రెడ్డి పాల్గొన్నారు.